తీయని జ్ఞ్యాపకం

తీయని జ్ఞ్యాపకం
తీరని స్వప్నమే
వీడి పోతున్నానిలా
హాయిగా నువ్వుండాలిలా
చిరునవ్వుతో వెల్లిపోనా
బాధ నాలోనే దాచుకోనా
నేస్తమా…తొలి స్వప్నమా

వీడలేకున్నా…వీడిపోతున్నా
నిన్నే కొరే ఆశలన్ని నాలోనే దాచుకున్నా
నీ గుర్తులన్ని మరిచేలా నన్నే మార్చుకున్నా
మరిచిపొగలనా…విడిచిపోగలనా
నువ్వులేకనే…బ్రతికిమనగలనా
వీడలేకున్నా…వీడిపోతున్నా
నేస్తమా…తొలి స్వప్నమా

నవ్వుతు ఉన్నా…కన్నీఅరి ఉన్నా
ఆగక యెగసె బాధలన్ని నాలోనే దాచుకున్నా
వేరే కలలను కనే తీరుగ నన్నే మార్చుకున్నా
కలలు కనగలనా…నువ్వు లేఅన్నట్టివి
అసలు కదలగలనా…నీ తోడు లేకున్నచో
నవ్వుతు ఉన్నా…కన్నీఅరి ఉన్నా
నేస్తమా…తొలి స్వప్నమా

వేవేళ తారలు చూసా

వేవేళ తారలు చూసా
వేడుకలాంటి నిన్నే చేరా
కమ్మని కలలా కథలే వ్రాసా
నమ్మని మనసుకి హాయిని చూపా
నీవల్లే ఆనందం నీవల్లే ఈ సమయం
నీవల్లే అధ్బుతం నీవల్లే సంబరం

నను నేను మరిచే తీరుగ
యేదొ మాయని చేసావే
నువ్వే నేననుకుంటూ సాగే
తీయని కవితై సాగావే
వరమో ఇది తీయని అనుభవమో
విధి రాతని మార్చే పరవశమే

కన్నీరే తుడిచే హాయిగ
కను రెప్పల మాటున చేరావే
మునుపెన్నడు తెలియని వెలుగే
నా కంటికి చూపావే
కలవో నా ప్రియమైన తొలి కథవో
కలకాని ఆనందాల కల్పనవో

వేవేళ తారలు చూసా
వేడుకలాంటి నిన్నే చేరా
కమ్మని కలలా కథలే వ్రాసా
నమ్మని మనసుకి హాయిని చూపా
నీవల్లే ఆనందం నీవల్లే ఈ సమయం
నీవల్లే అధ్బుతం నీవల్లే సంబరం

కనులకు వెలుగులా

కనులకు వెలుగులా
పెదవికి మాటలా
గుండెలో హాయిలా
నమ్మని ఆశలా
తీరిన కొరికలా
వలపుల పెన్నిధిలా
వరముల సిరిజల్లులా
మనసుకి మధురంలా
ధరి చేరావే
నా కథ మార్చావే

తీయని గేయంలా
తేనెల కావ్యంలా
దోచిన మధురిమలా
మార్చిన జీవితంలా
వాలిన హరివిల్లులా
విరిసిన పూవనంలా
మురిసిన యెవ్వనంలా
కలిసిన కలవరంలా
ధరి చేరావే
నా కథ మార్చావే

కనులకు వెలుగులా
పెదవికి మాటలా
గుండెలో హాయిలా
నమ్మని ఆశలా
తీరిన కొరికలా
వలపుల పెన్నిధిలా
వరముల సిరిజల్లులా
మనసుకి మధురంలా
ధరి చేరావే
నా కథ మార్చావే

ఈ దూరం

ఈ దూరం
తరిగేనా
ఈ భారం
తీరేనా
తరగకపొతే నే బ్రతికేదెలా
తీరకపొతే నే సాగేదెలా

దైవ సాశనమో యేమో
విరహభారమే అతి గోరం
వింత అనుభవమో యెమో
చెలియదూరమే అతి కష్టం
కలువలు విచ్చే ఊసే లేదా
వెన్నెల చేరే వేళే లేదా
నిషి లో మధి కదిలే
కలతే నా జత నిలిచే
వలపే ఒక విషమై మిగిలే
వయసే ఇక వేదన చెందే

పాప పరిహారమో యేమో
వొంటరి పయనం అతి దారుణం
యెవరి సాపమో ఇది యేమో
నవ్వు కరూవె ఈ సమయం
చెలియని చూసే జాడే లేక
తననే మరిచే మనసే లేక
వ్యధ తో మధి రగిలే
వలయమై కథ కదిలే
వలపే ఒక విషమై మిగిలే
వయసే ఇక వేదన చెందే

ఈ దూరం
తరిగేనా
ఈ భారం
తీరేనా
తరగకపొతే నే బ్రతికేదెలా
తీరకపొతే నే సాగేదెలా

ఒక మాట

ఒక మాట…ఒక చూపు
చిగురాస రేపదా
ఒక ఊశే…ఒక శ్వాసే
తలరాతే మార్చదా
లోకాలే మరిచేలా
ఆనందం చేరేనా
తొలి వెలుగే నింపేనా

కన్నులు నమ్మని స్వప్నాలే
కమ్మని కథలా రాగాలే
పలికించే పసిడి పలుకులు
విరబూసే చిలిపి నవ్వులు
తెరచాటు నుంచి
మన ఎధురుకొచ్చే
స్వర్గాలే

ఒక మాట…ఒక చూపు
చిగురాస రేపదా
ఒక ఊశే…ఒక శ్వాసే
తలరాతే మార్చదా
లోకాలే మరిచేలా
ఆనందం చేరేనా
తొలి వెలుగే నింపేనా

తొలి వెలుగే

తొలి వెలుగే విరిసిందే
చిగురాశే రేపిందే
చిరు జల్లై చేఇందే
ఉప్పెనలా యెగసిందే
నీవేలే ప్రేమా…నీవేలే
నీవేలే…
కలలో చేరి మురిపించావే
నిజమై నా దరికి చేరాలే

కదిలే కాలం మార్చని ఆశే
విరిసే పువ్వై పెరిగే ప్రేమే
మనసుంటే బాదే మిగిలేనా
కలలంటే కలతే రేగేనా
తొలి వలపులలొ మలుపేదీ
కన్నెటిని తుడిచేనా
తొలి కిరణాలలొ తపనేదీ
తలరాతని మార్చేనా

కురిసే మేఘం చూపని హాయే
తడిసే పెదవే పాదే పాటే
తోడుంటే లోకం మరిచేనా
వెంటుంటే సోకం వీడేనా
సిరి సిరి మువ్వల సవ్వడేది
నాట్యాన్ని ఆపేనా
విరిసే నవ్వుల తలపేదో
నాలో బాదని తీర్చేనా

తొలి వెలుగే విరిసిందే
చిగురాశే రేపిందే
చిరు జల్లై చేఇందే
ఉప్పెనలా యెగసిందే
నీవేలే ప్రేమా…నీవేలే
నీవేలే…
కలలో చేరి మురిపించావే

ఇప్పుడే ఇక్కడే

ఇప్పుడే ఇక్కడే మధి కొరే
వలపై వరదై చేరాలే
మురిసిన మౌనం తీసిన రాగం
తెలుస్కోలేవా
విరిసిన ఆశల తీయని వేగం
యెరిగిరాలేవా

అదిరే మనసే ఇదివరకెరుగని కొరిక రేపే
కమ్మని కలలా చెంతకు రావే
యెగసే అలలా కలవరపరిచే ఊహలు నీవే
తీయని మలుపై కథనే మార్చవా
ప్రాణం సైతం వేచున్నాదే
నిన్నే కోరీ బ్రతికున్నానే

కదిలే మేఘం చినుకై చేరే తలపే మార్చే
వన్నెల చిలకా పాటే పాడవా
తరిమే గాలే కబురులు తెచ్చే తపననే నీవే
మాయని మమతై తోదుగా అల్లుకోవా
ప్రాణం సైతం వేచున్నాదే
నిన్నే కోరీ బ్రతికున్నానే

ఇప్పుడే ఇక్కడే మధి కొరే
వలపై వరదై చేరాలే
మురిసిన మౌనం తీసిన రాగం
తెలుస్కోలేవా
విరిసిన ఆశల తీయని వేగం
యెరిగిరాలేవా

తొలి కల చెలి

తొలి కల చెలి వల నా పై
తదు పరి విరిసిన వలపై
తొలి సకమే మొదలై
తుది మెరుగులు దిద్దే
ఈ ప్రేమే మధురం
నీ తోనే స్వర్గం

వొదన్న ప్రేమా వలదన్న నన్నే
వరమై ఈనాడే వరదై పొంగేనా
లేదన్న ఆశ కాదన్న ఊసే
చెలిమై ఈపూటే మలుపై కదిలేనా
యేనాటికి నే నమ్మనీ ఆనందమే నాకోసమె చేర్చేనిలా

ఇన్నాల్లు లేనా చూసాక నిన్నే
నేనే ఓ మనిషై కవితలనే వ్రాసానా
హద్దంటూ లేదా ఆగేనా అడుగే
పరుగై నీ వైపే ఉప్పెనై యెగసేనా
అధృష్టమే నా నేస్తమై ఆకాశమే ఈనేలకే దించేనిలా

తొలి కల చెలి వల నా పై
తదు పరి విరిసిన వలపై
తొలి సకమే మొదలై
తుది మెరుగులు దిద్దే
ఈ ప్రేమే మధురం
నీ తోనే స్వర్గం

నమ్మలేని మలుపే

నమ్మలేని మలుపే నువ్వే
కమ్మనైన కలవే నువ్వే
విధి రాతను సైతం మార్చేసావే
తొలి కిరణమై నన్ను చేరావే
చీకటి నుంచి విడిపించావే

నిన్న లేనా అన్నట్టుగా
నన్న్ను నేనే మరిచానుగా
కన్న కలలు మిన్నంటగా
నువ్వు వరమై వలచావుగా
దైవం తానే కరునించి
నిన్నే నాకై పంపించి
తలరాతనే మార్చేనా
తొలి ప్రేమనే చేర్చేనా

పగలు రేయి మారి ఇంతగా
వెలుగు వెన్నెల చేరే వింతగా
వలపు వాన కురిసేనుగా
కలలే నిజమై విరిసేనుగా
వేకువ నేడే వికసించి
వేడుక తాని కలిసొచ్చి
నీ జతనే చూపేనా
నా బ్రతుకే పండేనా

నమ్మలేని మలుపే నువ్వే
కమ్మనైన కలవే నువ్వే
విధి రాతను సైతం మార్చేసావే
తొలి కిరణమై నన్ను చేరావే
చీకటి నుంచి విడిపించావే

చెప్పగలనే ఈనాడే

చెప్పగలనే ఈనాడే…మధిలో దాగిన మాట
చేయగలనే ఈపూటే…చెయ్యలనుకున్న బాస
తెలిసిందే నీపై నాలో ఇన్నాల్లుగా ఉన్నది ప్రేమే అని
తెలియందే నాకే యేదో ఓ హాయిలా సాగిన ప్రేమే అని

విడియం వీడే వేళయ్యిందే
చెంతకి చేరే చనువంటుందే
నాకై నువ్వు…నీకై నేను పుట్టామని
నీతోఎ నాఎను…గడిపే క్షణమే బ్రతుకని
చూపులు కలిసి…కలలే యెగసి…కమ్మని బంధం అల్లుకోనీ…
తెలిసిందే…
తెలిసిందే నీపై నాలో ఇన్నాల్లుగా ఉన్నది ప్రేమే అని
తెలియందే నాకే యేదో ఓ హాయిలా సాగిన ప్రేమే అని

మేఘం కురిసీ పాటయ్యిందే
వరసే కలిపే వలపయ్యిందే
గాలే నిన్ను…ఇప్పుడే నాతో కలపాలని
చినుకే తోడై…వయసే జోరై రేగని
మనసులు మురిసి…వరదై పొంగే…తీయని రాగం సాగిపోనీ…
తెలిసిందే…
తెలిసిందే నీపై నాలో ఇన్నాల్లుగా ఉన్నది ప్రేమే అని
తెలియందే నాకే యేదో ఓ హాయిలా సాగిన ప్రేమే అని

చెప్పగలనే ఈనాడే…మధిలో దాగిన మాట
చేయగలనే ఈపూటే…చెయ్యలనుకున్న బాస
తెలిసిందే నీపై నాలో ఇన్నాల్లుగా ఉన్నది ప్రేమే అని
తెలియందే నాకే యేదో ఓ హాయిలా సాగిన ప్రేమే అని