ఇది వరకూ

ఇది వరకూ
మనసెప్పుడూ
యెరుగదులే
ఈ ఆనందం

నువు చేరే
ఈ సమయం
మనసంతా
ఉల్లాసం

నీవలనేగా
నీవలనేగా
ఆకసంలొ మేఘాలన్ని రాగం తీసే

నీవలనేగా
ఆకసంలొ మేఘాలన్ని రాగం తీసే

యేమౌతుందొ నాలోనా నువు ఎదురైతే
పెదవే దాటని మాటేదొ వేదించేనే
యేమౌతుందొ నాలోనా నువు ఎదురైతే
పెదవే దాటని మాటేదొ వేదించేనే
యేమైనా ఆ
నీ ఊసే
యేమైనా ఆ
నీ ఊసే
మది కొరే
మది కొరే
నీ చెలిమే
ప్రాణాలే
నీ చెలిమే
ప్రాణాలే

ఇది వరకూ
మనసెప్పుడూ
యెరుగదులే
ఈ ఆనందం

నువు చేరే
ఈ సమయం
మనసంతా
ఉల్లాసం

జాజి మల్లె పువ్వులా

జాజి మల్లె పువ్వులా
జాబిలమ్మ నవ్వులా
తేట తెలుగు మాటలా
తేనెలొలుకు మాటలా
వెండి మబ్బు చినుకులా
వెన్నెలమ్మ తలుకులా
చేరుకున్న వలపులా
కొరుకున్న గెలుపులా
సొంతమైన అందమా
నా ఆనందమా

దాగి ఉన్న ఆశలా
చెప్పలేని ఊసులా
మారిపోని బాసలా
వీడిపోని స్వాసలా
నిన్న లేని నిజములా
నమ్మలేని వరములా
కమ్మనైన స్వరములా
వేదుకున్న ఫలములా
ప్రాణమైన బంధమా
నా వాసంతమా

కనుసైఘల కావ్యము

కనుసైఘల కావ్యము రాయనా
కొన చూపుల గేయము పాదనా
చిరునవ్వుతొ భావము తెలుపనా
కొనగొటితొ చిత్రము దిద్దనా

మాటే దాటని మనసిది
ధైర్యము చాలని వయసిది
కొరిక ఆగని వేలలొ, ఆసలు తీరని బాదలొ
సతమతమౌతూ, కలవరపడుతూ
కడలిని మదిలొ దాచుకోన
కలలని నీతొ పంచుకొన

తొలి చూపుల దారులు మార్చనా
హొలి వలపుకి తలుపులు తెరవనా
అన కధలొ మలుపులు తిప్పనా
నీ జతలొ పెదవే మెధపనా

కనుసైఘల కావ్యము రాయనా
కొన చూపుల గేయము పాదనా
చిరునవ్వుతొ భావము తెలుపనా
కొనగొటితొ చిత్రము దిద్దనా

కోరుకున్నది చెలిమయితే

కోరుకున్నది చెలిమయితే
చేరుకున్నది శోకమా
వేడుకున్నది తొడయితే
సొంతమయినది విరహమా

నీడలా నీ తొడుగా ఉండాలనే
నా ఆశాలే ఇక తీరవా
హాయిగా నీ చూపులొ కొలువుండాలనే
ఆ కొరికే ఇక భారమా

కోరుకున్నది చెలిమయితే
చేరుకున్నది శోకమా
వేడుకున్నది తొడయితే
సొంతమయినది విరహమా

మారని తలరాతలే పెనుబాదనీ
ఒహ్ మొడుగా నే మిగలనా
వీడనీ సంక్షొభమే ఈ బథుకనీ
నా మౌనమే పలికేనిలా

ప్రేమని లేదని

ప్రేమని లేదని చెప్పలేను
నా లొ ఆశల అలజడిది
నేనని నీవని చెప్పలేను
ఏవొ కొర్కెల ఒరవడిది

వెండి వాన కై వేచిన భూమి ని నెనే
మండుటెండలొ మెరిసిన చినుకై రావే

నేటిని రేపుని నమ్మలేను
కాలం తెలియని సందడిది
రాతని గీతని నమ్మలేను
హౄదయం యెరుగని పండగిది

రెండు కన్నుల నిండిన కలవే నీవే
నిండు గుండెలొ మండిన వ్యదవే నీవే
నా దారిని మరిచి నీ వైపే సాగానే
నీ పెరుని తలిచి ప్రతి పూట గడిపానే

నా గమ్యం నీవని నేనెంతొ మురిసానే
ప్రతి మార్గం నీ గురుతై ప్రతి అదుగు వేసానే

ప్రేమని లేదని చెప్పలేను
ఏదొ తీయని గొడవిది
నెనని నీవని చెప్పలేను
నీడై వీడని చొరవిది

వెండి వెన్నెలే కొరిన సాగరం నేనే
వెచ్చని వెలుగులు కురిపించి పొవే

నేటిని రేపుని నమ్మలేను
గాలం వేసిన ప్రణయమిది
రాతని గీతని నమ్మలేను
రాగం మార్చిన చరనమిది

కాసేపు కనరావా

కాసేపు కనరావా కాస్తైన బాధ తీర్చవా
ఓ మారు ఇటు రావా నేడైన తొడు ఉండవా
నువ్వు రాక చంద్రుడు లేడు,
మబ్బులు చినుకై రాలేదు,
చిన్నబొయి ఆ సూరీడు,
నీ కొసం వడగాలై వేగేడు
పిలవ లేక వయసే ఆగే,
ఆగ లేక మనసే రేగే,
రేగి పొయే ఆశే నేడే,
నీకై వెతికీ అలిసి పొయే
నా గోడు వినలేవా రాయిలా మారిపొయావా
బాసలే మరిచిపొయావా మొడులా మిగిలిపొయావా
నిను తలచి కలలు చూసాను,
కలలొ తెగ మురిసిపొయాను,
కౌగిలిలొ కరిగిపొయాను,
కలని తెలిసి కృంగిపొయాను.
నిను మరిచి బ్రతుకుదామన్నా,
ప్రతి క్షణము నరకతుల్యము
నిను విడిచి సాగుదామన్న
ప్రతి కదలిక కన్నీటి రాగము.
కాసేపు కనరావా కాస్తైన బాధ తీర్చవా
ఓ మారు ఇటు రావా నేడైన తొడు ఉండవా

కల అనుకొనా నిజమనుకొనా

కల అనుకొనా నిజమనుకొనా ఈ వేలలో నీ థోడులో
వలపనుకొనా లేక వరమనుకొనా ఈ హాయిలో నీ జొరులో

చొస్తూ ఉండగా నన్ను మార్చావు
నేనే నమ్మని నన్నే చూపావు

నేనే యెరుగని నన్నే చూసవు
నాకే తెలియని కలలే రేపావు

ఏదొ తీయని మాయని దాచావు
నాపై ఏదొ మత్తుని జల్లావు

పిలుపనుకొనా గెలుపనుకొనా నీ పలుకులో కనుసైఘలో
స్వరమనుకొనా లేక లయ అనుకొనా నీ పాటలొ ప్రతి మాటలో

మలుపనుకొనా మరుపనుకొనా ఈ బాదలొ తీపి చేదులొ
సిరులనుకొనా లేక మనులనుకొనా నీ నవ్వులొ ముత్యాలలొ

కల అనుకొనా నిజమనుకొనా ఈ వేలలో నీ థోడులో
వలపనుకొనా లేక వరమనుకొనా ఈ హాయిలో నీ జొరులో

చొస్తూ ఉండగా నన్ను మార్చావు
నేనే నమ్మని నన్నే చూపావు

రెక్కలు కట్టుకు సాగనా

రెక్కలు కట్టుకు సాగనా,
ధిక్కులు చీల్చుకు చేరనా,
కమ్మని కలలా కడలిలొ,
వెన్నెల వెలుగుల అలలలొ,
తలపుల వలపుల మన ప్రేమ,
పువ్వుల నవ్వుల హాయే సుమ.

కలువకు వంకకు తెలియని,
మన కధ మలుపొకటుంధని
కొండ కూన ఆలకించని,
కమ్మని స్వరమొకటుంధని.

గొంతుకు చించుకు పాడనా,
మొక్కులు కొరుతు వేడనా,
నమ్మని నిధుల కొలనిలొ,
వన్నెల చిన్నల వెలుగులొ,
మరువని మధురము మన ప్రేమ,
చెరగని కావ్యము మన ప్రేమ.

కానిది రానిది యేముంది

కానిది రానిది యేముంది
తెలియక తేలనిదేముంది
తరగని చెదరని ఆశే ఉంటే
వీడని మాయని పంతం ఉంటే
నింగీ నేల కలిపే ధైర్యం ఉంటే
భవితను చూసే బాసే ఉంటే

ఊహకి హద్దుంటే కవితేది
ఆశకు అంతుంతే భవితేధి
అర్ధం లేని మౌనం రాగమవ్వధా
ప్రెమే లేని హౄధయం భారమవ్వధా

ఛిరునవ్వుల పువ్వుల వనమే జీవితం
చిగురాశల ఊసుల కడలే జీవితం
వెనుకడుగే వేయ్యక సాగితే
అడుగడుగున సాహసం నిండితే
కానిది రానిది యేముంది
తెలియక తేలనిదేముంది

మరుమల్లెల మధురస్వరమే జీవితం
చిరుజల్లుల చల్లని వరమే జీవితం
నిశ్చయము నిర్భయము కలిస్తే
తదేక ద్యానముతొ సాగితే
కానిది రానిది యేముంది
తెలియక తేలనిదేముంది

ఊహకి హద్దుంటే కవితేది
ఆశకు అంతుంతే భవితేధి
అర్ధం లేని మౌనం రాగమవ్వధా
ప్రెమే లేని హౄధయం భారమవ్వధా

లేవు కదా ఇక రావు కదా

నేరం నా కల్లదే నిను చూడగా
దొషం నా కలలదే నిను కొరగా
నేరం నా వయసుదే నిను కలవగా
పాపం నా మనసుదే నిను తలవగా

లేవు కదా ఇక రావు కదా
నా తలపులనే విడి పొవు కదా
ప్రేమ కధ ఇక లేదు కదా
తొలి వలపులకే వీడ్కోలు సదా

ఘోరం నా పయనమే నిను వీడాక
శాపం నా కధనమే నువు తొలిగాక
ఘోరం విధి వైణమే ఈ తీరుగా
శాపం మన కలయికే విరహాలుగా

లేవు కదా ఇక రావు కదా
నా తలపులనే విడి పొవు కదా
ప్రేమ కధ ఇక లేదు కదా
తొలి వలపులకే వీడ్కోలు సదా