ఈనాడే

ఈనాడే తెలిసిందే
మనలోనే మొదలయ్యిందే
తొలిప్రేమ వరమయ్యిందే
ఈనాడే

నీతోడే కొరిందే
నీ చెలిమే అడిగిందే
మనసంతా మురిసిందే
ఈనాడే

కలకాదే ఇది నిజమేలే
అంటూ వింతేగా
కలనైనా ఈ వాసంతం
చేర లేదుగా
కలవరమో పరవశమో ఏమో
మధి దోచే మధురాల సీమో

ఇదిగో చెంతనే చేరానే
కల్లల్లోనే చూసానే
వివారాలన్ని తెలిసేలే
ప్రణయాలే కొన్సాగాలే

మౌనం సరికాదే
చెలిమైనా నేడే
వరసే కుదిరాక
మొహమాటం తగదే

ఆకాశం ఇలదించైనా
మేఘాల హరివిల్లే
నీకోసం దరిచేర్చైనా
నేడే
ఆననదం ఇకవిరిసేల
సంగీతం కొనసగాలా
మనమొకటై వేడుకలగా
నేడే

కడలి అలలా చిలిపి కలలా

కడలి అలలా చిలిపి కలలా
దరికి చేరే వలపు వలవా
కనులనడిగా కలలొ వెతికా
మలుపు తిరిగే పలుకులనవా
నేడే మనసే జత కోరిందనీ
నీతో బ్రతుకే కొన్సాగాలనీ
ఇకపై వయసే చెలరేగిందనీ
వలపే వరమై విరబూసిందనీ

వాగుల్లో వంకల్లో కదిలేటి నదిలాగా
మాటల్లో నవ్వుల్లో విరిసేటి సుమమేగా
నీ పేరు నా పేరు జత చేర్చే ఈ కథనం
నీలోని నాలోని మొదలయిన ప్రియ సమరం
నిజమేదొ కల ఏదో తెలియనిదీ ఈ సమయం
చూస్తూనే ఉండాలి అనిపించే అదృష్టం

చుక్కల్లో దిక్కులో నిన్నెలే చూస్తున్నా
నా గుండె లోతుల్లో నిన్నేగా దాచున్నా
నువ్వు వేరు నే వరు అనుకుంటే తప్పేగా
కలలెన్నొ కలిపేటి అధ్బుతమీ వలపేగా
ఔనన్న కాదన్నా చరితలిక మారేగా
ఎవరేమి అనుకున్నా ఇక విజయం మనదేగా

మధువనిలో వీచే

మధువనిలో వీచే మధురాల సుగంధమా
తొలికలలొ చేరే జవరాలా ఆనందమా
నీ అడుగులలో ముత్యాలే పేర్చనా
నీ చూపులలో కవితలనే చదవనా
నీ నవ్వే విరబూసే విరజాజి కాదా
నీతోనే నేనుంటే వరమంతా నాదా

కలిసే కలవో కదిలే కథవో
మనసే కోరే తీయని మలుపో
పిలుపో గెలుపో ఎనలేని మయిమరుపో
నిజమై చేరే కలవైన తొలివలపో
నీలాకాశం లో నీలమంత నీకోసం అందించనా
ఎగసే కెరటంలో జిలుగునంత నీతోనే చవిచూడనా

నడిచే నదివో మురిసే ఝరివో
వయసే ఎరుగని వెన్నెల వలవో
మెరిసే మెరిసే వర్ణాల తొలివెలుగో
కురిసే కురిసే కుసుమాల తొలకరివో
హృదాయవేశం లో వేగమంత ప్రేమగా చూపించనా
ఇకపై లొకంలో అమరం మన ప్రేమని చాటి చెప్పనా

నీవనుకుంటే కలగని ఉంటే

నీవనుకుంటే కలగని ఉంటే
అది జరగాలంటు వ్రాసుందా
కొరికలుంటే కొరుతు ఉంటే
అన్నీ తీరే వీలుందా
జరిగేదేదైనా అంతా మంచికని
ముందుకు సాగటమే చాల మంచి పని

ఆశల అలలు ఊరిస్తూనే
కొర్కెల కలలు వెదిస్తూనే
జీవితమంతా గడిచేనే
కాలమంతా కదిలేనే
వేదన విడిచీ
ముందుకు కదిలి
సాదించాలి
పురొగతికై
పయనించాలి

నీవనుకుంటే కలగని ఉంటే
అది జరగాలంటు వ్రాసుందా
కొరికలుంటే కొరుతు ఉంటే
అన్నీ తీరే వీలుందా
జరిగేదేదైనా అంతా మంచికని
ముందుకు సాగటమే చాల మంచి పని

నీ ప్రతి కదలిక

నీ ప్రతి కదలిక
నా వైపైతే
ఎంతో బాగుంటుందీ
నీ ప్రతి కల ఇక
నా కథ అయితే
ఇంకా బాగుంటుందీ
దారులు కలిసే తీరులో
ఆసలు ఎగసే హాయిలో
వలపే విరిసే జోరులో
మనసులు ముడి పడి
అడుగులు తడబడి
పేరులు జతపడి
మనమైపోతే ఇంకా ఇంకా బాగుంటుందీ

నింగిన సాగే మెఘాన్నడిగా
జల జల పారే నదినే అడిగా
చల్లగ వీచే గాలిని అడిగా
తూరుపు విరిసిన వేకువనడిగా
మన కథ మలుపే ఎప్పుడనీ
గెలిచే వలపే ఎక్కడనీ
చినుకుల జడిలో
మెరుపుల అలలో
మల్లెల కలలో
హరివిల్లుల జతలో
కలలే ఇకపై నిజమని
నువ్వు నేను మనమని
దిక్కులు చాటుతు పాడని
ఆనందాలన్నీ

నీ ప్రతి కదలిక
నా వైపైతే
ఎంతో బాగుంటుందీ
నీ ప్రతి కల ఇక
నా కథ అయితే
ఇంకా బాగుంటుందీ
దారులు కలిసే తీరులో
ఆసలు ఎగసే హాయిలో
వలపే విరిసే జోరులో
మనసులు ముడి పడి
అడుగులు తడబడి
పేరులు జతపడి
మనమైపోతే ఇంకా ఇంకా బాగుంటుందీ

కావాలంటే

కావాలంటే చెంతకు రానా
నువ్వొద్దంటే వెల్లి పోనా
పువ్వై నువ్వే నవ్వే వేళ
మధి నమ్మని ఆనంధం
ఒక్కసారిగ నాకే సొంథం
చినుకే నాపై కురిసే వేళ
నిన్నె కొరెను అనుబంధం
వలపుల తొలి వాసంతం

నిన్నా మొన్నా కొరుకున్నది
నిన్నే నిన్నే
నేడు రేపు నమ్ముకున్నది
నిన్నే నిన్నే
ప్రేమించినా ద్వేషించినా
నువ్వౌనన్నా కాదన్నా
మధి కొరేధి
నిన్నే నిన్నే

కావాలంటే చెంతకు రానా
నువ్వొద్దంటే వెల్లి పోనా
పువ్వై నువ్వే నవ్వే వేళ
మధి నమ్మని ఆనంధం
ఒక్కసారిగ నాకే సొంథం
చినుకే నాపై కురిసే వేళ
నిన్నె కొరెను అనుబంధం
వలపుల తొలి వాసంతం

యెంతెంతో జరిగిందే

యెంతెంతో జరిగిందే
యేదేదో అడిగిందే
నీ కోసం వేచుందే
నీ తలపే కొరిందే
నువు లేక లేనందే
మల్లి మల్లి నీ పిలుపే వింటుందే

చేరువైనా ధూరమైనా
చెంతనున్నా వీడిపొయినా
ఉన్నావనుకుంటుందే
లేవంటే నమ్మదే నా మధి
ఇక రావంటే వినదే యెందుకది

గాలికైనా చెప్పలేనా
వానలాగా చేరలేనా
చెప్పాలనిపించిందే
మధి మాటున దాగిన మాటది
ఇప్పటికైనా రావలసిన మలుపది

యెంతెంతో జరిగిందే
యేదేదో అడిగిందే
నీ కోసం వేచుందే
నీ తలపే కొరిందే
నువు లేక లేనందే
మల్లి మల్లి నీ పిలుపే వింటుందే

తొలిచూపులో

తొలిచూపులో
చిరునవ్వులో
కనుసైఘలో
తడబాటులో
యెమయ్యిందిలా నా గుందెలో
నీకోసమే కదిలిందిలా

నీ వైపుగా సాగిందిలే
నా ఊహలా
నీ నీదగా నదిచిందిలే
నా ఆశలా

కలవరమే ఈ ప్రేమా
పరవశమే ఈ ప్రేమా
మనసంతా మధురంగా
నిండిందే ఈ ప్రేమా
మునుపెప్పుడూ లేనంత
సంతోషం ఈ ప్రేమా
అసలెవరూ కననంత
అధ్బుతమే ఈ ప్రేమా

జడివానలో
చిరుగాలిలో
చిగురాకులో
సిరిమల్లెలో
ఆ మేఘమే ఈనాడిలా
ప్రియ గానమై కురిసిందిలే

నవలోకమే చూపిందిలే
హరివిల్లులా
తొలి చీకటే తరిమిందిలే
సిరివెన్నెలా

కలవరమే ఈ ప్రేమా
పరవశమే ఈ ప్రేమా
మనసంతా మధురంగా
నిండిందే ఈ ప్రేమా
మునుపెప్పుడూ లేనంత
సంతోషం ఈ ప్రేమా
అసలెవరూ కననంత
అధ్బుతమే ఈ ప్రేమా

కారు మబ్బు కమ్ముకుంది

కారు మబ్బు కమ్ముకుంది
చీకటంత చేరువయింది
ఆశలన్ని వీడమంది
వెన్నెలేది కాననంది
ఎందుకో మరీ

రెక్క విరిగి పడ్డట్టి
సీతా కోక చిలకల్లే
గొంతు మూగబొయినట్టి
కొమ్మ మీది కొయిలల్లే
విసిగి పోయి వేచింది
మధి ఎందుకో మరీ

కన్నీరే నేడే జడివాణై వ్రాలే
చిగురాశే నేడే చితి మంటైపోయే
తిరిగి రాని తోడు కై విరహాలే
కలిసి రాని కొరికలా పయణాలే

వెన్నెలలా వెలుగే కరువయ్యి పొయే
కనరానై బాధే మనసంతా నిండే
మరువలేని మధురాలా ఆ స్మృతులే
వ్రాసేనే వేదనలా కావ్యాలే

కారు మబ్బు కమ్ముకుంది
చీకటంత చేరువయింది
ఆశలన్ని వీడమంది
వెన్నెలేది కాననంది
ఎందుకో మరీ

రెక్క విరిగి పడ్డట్టి
సీతా కోక చిలకల్లే
గొంతు మూగబొయినట్టి
కొమ్మ మీది కొయిలల్లే
విసిగి పోయి వేచింది
మధి ఎందుకో మరీ

ఈ స్నేహమే

ఈ స్నేహమే జీవితాన్ని మల్లి చూపించెనే
నీ స్నేహమే జీవితాన్ని నాకై మార్చెనే
ప్రేమో యెమో అనిపించేలా…ఎన్నొ కలలని చూపించెనే

నిను కలిసిన తరువాత నమ్మ లేకున్నా
ముందున్నది నేనేనా అని
నివి చేరిన తరువాత మారి పోతున్నా
లేదన్నది బాదేనా అని
నవరాగలెన్నొ పలించింధి నీ స్నేహమే
తొలివేడుకలేవొ జరిపించింధి ఈ మేఘమే

ఈ స్నేహమే జీవితాన్ని మల్లి చూపించెనే
నీ స్నేహమే జీవితాన్ని నాకై మార్చెనే
ప్రేమో యెమో అనిపించేలా…ఎన్నొ కలలని చూపించెనే