పిలుపే వింటున్నా

పిలుపే వింటున్నా
ఇది నిజమేనా
కలలే కంటున్నా
కలవరమేనా
నీతో ఉన్నానా
నేనే ఇకలేనా
మనమైపొయాకా
మనసే మురిసేనా
పిలుపే వింటున్నా
ఇది నిజమేనా

నీడై తోడై నువ్వుండగా
కదిలే కాలం ఓ పండుగా
వేడుక మనదై వేదిక మనసై
వలుపే గెలుపై సాగాలిలా
తీయని మలుపై చేరిన పిలుపై
కమ్మని తలపై మ్రొగాలిలా
పిలుపే వింటున్నా
ఇది నిజమేనా

చినుకై మెరుపై కురిసేనిలా
వరదై నన్నే ముంచేనిలా
మాయని మమతై తీయని ఘటనై
పలుకే వరమే వినిపించదా
తీరని కలలే తీరిన క్షణమై
మీటిన లయవై కొన్సాగదా
పిలుపే వింటున్నా
ఇది నిజమేనా

తపన తెలిసి

తపన తెలిసి
మదన పెడితే
ప్రేమ కాదే
కలలు చూపి
మాయమయితే
నేరమేలే
చిలిపి నవ్వే రువ్వకే
వలపు పాటే పాడకే
మనసు దోచి పోవొద్దే

ఆగమన్నా ఆగదే ఆశ నాదే
తప్పు అన్నా తప్పదే వయసు బాదే
మేఘమాలా చూడేలేక
మౌనగీతం వీడలేక
రగిలె నాలో కోరికేదో
కదల లేని గాద నేడే

వేడుకున్నా చేరదే తోడు నీదే
వేదనైనా వీడదే నీడ లాగే
చెంత చేరి చెప్పలేకా
గుండెలోనే దాచలేకా
ఎగసే నాలో విరహమేదో
కడలి లాంటి కథనమేదో

తపన తెలిసి
మదన పెడితే
ప్రేమ కాదే
కలలు చూపి
మాయమయితే
నేరమేలే
చిలిపి నవ్వే రువ్వకే
వలపు పాటే పాడకే
మనసు దోచి పోవొద్దే

ఎందుకో గుండెలో

ఎందుకో గుండెలో
కలతే నేడే
ఎప్పుడు లేనిడి
వేదనే నేడే
ఆగిపోమన్నా ఆశలే వినవే
వీడిపోమన్నా విరహమే వీడదే
శాపమో భారమో నాలో
మారని గాదిదే నాదే

మేఘమే లేదనీ
మౌనమే పాడనే
జల్లులో హాయదే
హృదయం కోరనే
వేదనే నన్నిలా
చీకటై కమ్మనే
కోరితే మారునా
సోకమే తీరునా
వేడితే నేస్తమా
చెంతకే చేరునా
ఎందుకో ఎందుకో గుండెలో కలతే
ఎప్పుడు ఎప్పుడు లేనిది వేదనే

ఎందుకో గుండెలో
కలతే నేడే
ఎప్పుడు లేనిడి
వేదనే నేడే
ఆగిపోమన్నా ఆశలే వినవే
వీడిపోమన్నా విరహమే వీడదే
శాపమో భారమో నాలో
మారని గాదిదే నాదే

ఆకాశంలో సాగింది ఆశే

ఆకాశంలో సాగింది ఆశే
హద్దే లేనంతగా
ఆరాటంతో చెలరేగింది నేడే
అంతే లేనట్టుగా

మధిలో మధురాల రాగం
కలలో కమనీయ తాలం
విరిసే మధువనిలో పయనం
అలుపెరుగని హాయేదో సొంతం

ఈ జీవితం ప్రియమైనదీ
ఈ వైణమే వరమైనదీ
ఈ నాడిలా నిజమైనదీ
ఏనాటిదో కల తీయనిదీ
తొలి ప్రేమలో ప్రతి క్షణమిదే
అతి సుందరం అతి అధ్భుతం

మురిసే మౌనాల హారం
పలికే సుగంధాల గేయం
యెవరు ఎరుగనిదీ విచిత్రం
ఇప్పుడే నాకే ఇది సొంతం

ఆకాశంలో సాగింది ఆశే
హద్దే లేనంతగా
ఆరాటంతో చెలరేగింది నేడే
అంతే లేనట్టుగా

నీ తొలి కలలో

ఎంత దూరం
నీ పిలుపై
ఎంత కాలం
అని వేచుండాలే
నా మధిలో
నా కలలో
నీవే వొచ్చి వేదించావే
నా ప్రాణం నీదే నీకది తెలుసు గా
నీ తొలి కలలో
నే కనిపించి కవ్వించలేదా
నీ తొలి కలలో
నే కనిపించి కవ్వించలేదా
ఆ కలనే నువు నిజమే
చేసి చెంత చేరవా

వెతికే ప్రతి వైపు
మిగిల్చేనే వగపే నాకు
పలికే ప్రతి పలుకు
పిలిచెనే పేరే నీది
నా కన్నీరిదే నీ కోసమే
రాగమాలపించే
నా చిగురాసలే వేసారిలా
విరహాలాయెనే
నే కను మూసినా కను తెరిచినా
నీ గ్న్యాపకం వేదించెనే

నీ తొలి కలలో
నే కనిపించి కవ్వించలేదా
నీ తొలి కలలో
నే కనిపించి కవ్వించలేదా
ఆ కలనే నువు నిజమే
చేసి చెంత చేరవా

కల నేడే వరం లాగా

కల నేడే వరం లాగా
నన్నే చేరే స్వరం లాగా
ఆకాశం లో మేఘం లాగా
మేఘం వెంటా విల్లే రాగా
మనసుకే తెలియని
మధురమే నేడిలా
నేలపై ఒదిగెనా
కలతలే మాపేనా

పిలుపులో పలుకులో
వలుపులో గెలుపులో
నమ్మనీ తలపులో
చేరెనా హాయిదే
చేసెనా మాయిదే
ఇచ్చిన మాటలో
చూపిన బాటలో
వేడుక వేలలో
వేకువ వెలుగులో
మారిన కథలివే
మార్చిన కలలివే

కల నేడే వరం లాగా
నన్నే చేరే స్వరం లాగా
ఆకాశం లో మేఘం లాగా
మేఘం వెంటా విల్లే రాగా
మనసుకే తెలియని
మధురమే నేడిలా
నేలపై ఒదిగెనా
కలతలే మాపేనా

లేదనుకున్నా నీ ప్రేమా

లేదనుకున్నా నీ ప్రేమా
రావనుకున్నా ఇక పైనా
కనుమరుగైనా నా ఆశా
మల్లి కలలే చూసా
వెన్నెల వేలలో
వేదనే వీడనా
నీ పిలుపే మలుకొలుపని
తొలి వలపుకి ఇది గెలుపని

గల గల వీచే గాలిపాటా
జల జల పారే సెలయేటి ఆటా
అందంగా మధి దొచెనంటా
ఆనందం చవి చూపెనంటా
నీ పలుకే వింటే
వేకువే విరిసనెంటా
మేఘమే ధరి చేరి
హరివిల్లులా విరిసేనా

లేదనుకున్నా నీ ప్రేమా
రావనుకున్నా ఇక పైనా
కనుమరుగైనా నా ఆశా
మల్లి కలలే చూసా
వెన్నెల వేలలో
వేదనే వీడనా
నీ పిలుపే మలుకొలుపని
తొలి వలపుకి ఇది గెలుపని

సెలవిక కలలకే

సెలవిక కలలకే
ఆశల అలలకే
మునుపెప్పుడో అనుకున్నానో ఏమో
ఈ క్షణమే కథ మారిందో ఏమో
తెలిసి తెలిసి వలయాలే మధి కొరితే అది నేరమేగా
ఎగసి ఎగసి విరహాలే ధరి చేరితే అతి ఘోరమేగా

నీడైనా నను వీడేనే చీకటిలో
నీ తలపే వీడనిదే ప్రతి క్షణము
జాడైనా ఎరుగని ఈ హృదయంలో
తొలి కొరికలే చేసేనే కొలాహలము
జరిగిన కథనే మరువమని
కదలాల్సినవి ఇక మలుపులని
వేడినా వినదే మనసే
ఆశలే వీడదే మనసే

ప్రాయలా తొలి శాపాలా వేదనలో
అభిమానాలా అనుమానాలా సంఘర్షణ
విధి వ్రాతే వంచించే పయనంలో
సోకాలా తుది రాగాల ఆకర్షణ
వలపుల కలలే తీరవని
వరముల ఘడియలే చేరవని
వేడినా వినదే మనసే
ఆశలే వీడదే మనసే

ఎవరో నీకై

ఎవరో నీకై మధి నిండ ఆశలు దాచే
ఎప్పుడు నీ తలపే తనలో వెలుగేదో నింపే
ఒక మాట వరమల్లే మీటే
చిరు నవ్వే చిరు జల్లై తడిపే
కలతంతా మరిచేలా చేసే
వాసంతం వాకిట్లొ చేర్చే

ఇంతింతగానే ఊసే మొదలై
అంతంతగా కదిలే మలుపై
నిన్నింతలా లేని హాయై
ఈనాటికే చేసే మాయై
నింగి తారలన్ని నేలకొదిగినట్టుగా
గుండె గూటిలోని ఆశ తీరెనే ఇలా

ఉన్నపాటుగా ఉరికె వయసే
నమ్మనట్టుగా చేసే రభసే
హద్దులన్ని వీడి ఎగిరే గువ్వే
పొద్దులన్ని కొత్త రంగే చూపే
వెండి వానలోనే వయసు విరిసినట్టుగా
కొంటె స్వప్నమే నిజమై చేరేనే ఇలా

తానెవరో తెలియదుగా

తానెవరో తెలియదుగా
మనసంతా దోచెనిలా
ఇదివరకు ఎరగనుగా
పులకింతా విరిసేనిలా
తనవల్లే తెలిసాకా
తనవరకు పోలేకా
మధిలోని ఈ మాటా
తనచెవిన వెయలేకా
మధురంగా ఈ బాద
నాలోనే తొలి గాద

చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది
నీ చెంతకు చేరాలని మధి కోరింది
నా ప్రేమని తెలిపి నీ వొడిలొ ఒదిగి
లోకాన్నే మరిచి కౌగిలిలో మురిసి
తొలికలలే తీర్చుకోవాలే
వేడుకలే జరుపుకోవాలే

నీ నీడై కదలాలని అనిపిస్తుంది
మన జాడే ప్రెమే అని తెలిసొస్తుంది
నీ కనుల కలనై నా యదలో మెరుపై
కలకాలం మనమై ఎనలేని వరమై
అలలాగే ఎగసే విధివ్రాతే కలిసే
వాసంతం దరికిచేరాలే
ఆనందం మనదే కావాలే