సన్న జాజి పువ్వా

సన్న జాజి పువ్వా
మ్రొగుతున్న మువ్వా
గుండెలోను నువ్వా
వెన్నెల వేళల రావా

అడుగడుగున జతగా నడిచే తీయని నేస్తమా
ప్రతి పదమున పల్లవి పాడే కమ్మని రాగమా
మధి నమ్మని వెల్లువై విరిసిన తీయని స్వప్నమా
అరవిరిసిన ఆశలు చేసిన వేడుక రూపమా

సన్న జాజి పువ్వా
మ్రొగుతున్న మువ్వా
గుండెలోను నువ్వా
వెన్నెల వేళల రావా

పగలెరుగని వెలుగులు చూపే మంజుల కిరణమా
రేయెరుగని హాయిని చేర్చే వెన్నెల వర్షమా
వయసెరుగని వలపుల వేడిని రేపిన సాగరమా
కలతెరుగని కన్నుల కొంటెతనమా నా ప్రేమా

సన్న జాజి పువ్వా
మ్రొగుతున్న మువ్వా
గుండెలోను నువ్వా
వెన్నెల వేళల రావా