వెతుకుతూనే ఉన్నా

వెతుకుతూనే ఉన్నా మనసా నీకై
వేడుతూనే ఉన్నా చెలియా నీకై
వేకువ రాతిరి నిన్నే కొరి పూజలు చేసా
వేడుక యెరగక నీకై నేను వాకిట వేచా
కాలం కదలని నిన్నటి వైపుగా
దూరం తరగని నిన్నే చూపగా

పయనం నీ వల్లే మొదలయ్యిందే
కథనం నీ వల్లే నిజమయ్యిందే
బ్రతుకే నీ వల్లే వరమయ్యిందే
నీ జాడ లేక నా మనసే మోడయ్యిందే
గాలి కి తెలుసు వాన కి తెలుసు
నీకై వెతకని చోటే లేదని
నిన్నే కోరని పూటే లేదని
ప్రపంచమంతా వెతుకుతూనే ఉన్నా
అన్ని దెవుల్లకు మొక్కుతూనే ఉన్నా

వెతుకుతూనే ఉన్నా మనసా నీకై
వేడుతూనే ఉన్నా చెలియా నీకై
వేకువ రాతిరి నిన్నే కొరి పూజలు చేసా
వేడుక యెరగక నీకై నేను వాకిట వేచా
కాలం కదలని నిన్నటి వైపుగా
దూరం తరగని నిన్నే చూపగా