వీడను నీ దారే

కలనైన నే వీడను నీ దారే
యెప్పుడైనా పెదవి పలికే నీ పేరే
విజయమే నీ తలపుతో ముందుకు సాగితే
విరహమే తీపి వరమే నిన్నే కోరుకుంటే
ముగిసిన కథ కానే ఇప్పుడే మొదలే

చీకటిని చీల్చే వెలుగై రానా
వేకువలో నీతో వేడుక జరుపుకోనా
కాలం కాదన్నా లోకం అడ్డైనా
వీడను నీ దారే
మది పలికే నీ పేరే

కన్నీటిని తుడిచే గాలై తాకనా
వెన్నెలలో నీ కౌగిలిలో ఒదగనా
వ్రాతని మార్చైన రేపటిని ఎదిరించైనా
వీడను నీ దారే
మది పలికే నీ పేరే

కలనైన నే వీడను నీ దారే
యెప్పుడైనా పెదవి పలికే నీ పేరే
విజయమే నీ తలపుతో ముందుకు సాగితే
విరహమే తీపి వరమే నిన్నే కోరుకుంటే
ముగిసిన కథ కానే ఇప్పుడే మొదలే