విరిసిందే హరివిల్లే

విరిసిందే హరివిల్లే
కురిసిందే చిరుజల్లే
మురిసిందే నా మనసే
నా జతగా నువ్వు చేరాక
పగలు రేయి నిన్నె నిన్నె తలచే నా మనసే
కలలో ఇలలో నిన్నె నిన్నె కొరే నా వయసే

ఒంటరి పడవై కడలిలో సాగనే ఇన్నినాల్లు
నమ్మని మలుపై నా కథలో చేరావే ఈనాడు
అలలా యెగసే నా ఆశే నవరాగం పలికిందే
వలలే విసిరే నీ వయసే వరమేదో చూపిందే

వెన్నెల వెలుగై నా మధిలో వెలిగావే చీకటిలో
తీయని పలూకి నా యధలో నిండావే కొరికలో
పరుగే తీసే ప్రాయలే ఆకశం చేరేనే
మెరుపై మెరిసీ నిన్నే చూసీ చినుకై ఒదిగేనే

విరిసిందే హరివిల్లే
కురిసిందే చిరుజల్లే
మురిసిందే నా మనసే
నా జతగా నువ్వు చేరాక
పగలు రేయి నిన్నె నిన్నె తలచే నా మనసే
కలలో ఇలలో నిన్నె నిన్నె కొరే నా వయసే