రెండు కన్నులా

రెండు కన్నులా వెండి వెన్నెలా చూపుతున్నదీ నీ కలలే
నిండు గుండెలో కొంటె పాటలా చేరుకున్నదీ నీ పిలుపే
తొలి ప్రేమ దారిలో వింత యాణమా
మనసైన వేళలో వలపు గానమా
తెలియని కలలా అలలలో తడిసీ
విరియని ఆశల కడలిలో కదిలీ

కంటి చూపుతో నిన్న లేని సరికొత్త లోకాన్ని చూపించావే
చిన్ని నవ్వుతో వెన్నెలైన తొలి వేడుకేదో దరి చేర్చావే
మధురాల సీమలన్ని ఇక మనవేగా
మధికొరుకున్న తొలి పర్వముగా
కలనైన చూడనీ ఆనందంగా
మలుపేదో నడిపిన వేదంగా

రెండు కన్నులా వెండి వెన్నెలా చూపుతున్నదీ నీ కలలే
నిండు గుండెలో కొంటె పాటలా చేరుకున్నదీ నీ పిలుపే
తొలి ప్రేమ దారిలో వింత యాణమా
మనసైన వేళలో వలపు గానమా
తెలియని కలలా అలలలో తడిసీ
విరియని ఆశల కడలిలో కదిలీ