యెంతెంతో జరిగిందే

యెంతెంతో జరిగిందే
యేదేదో అడిగిందే
నీ కోసం వేచుందే
నీ తలపే కొరిందే
నువు లేక లేనందే
మల్లి మల్లి నీ పిలుపే వింటుందే

చేరువైనా ధూరమైనా
చెంతనున్నా వీడిపొయినా
ఉన్నావనుకుంటుందే
లేవంటే నమ్మదే నా మధి
ఇక రావంటే వినదే యెందుకది

గాలికైనా చెప్పలేనా
వానలాగా చేరలేనా
చెప్పాలనిపించిందే
మధి మాటున దాగిన మాటది
ఇప్పటికైనా రావలసిన మలుపది

యెంతెంతో జరిగిందే
యేదేదో అడిగిందే
నీ కోసం వేచుందే
నీ తలపే కొరిందే
నువు లేక లేనందే
మల్లి మల్లి నీ పిలుపే వింటుందే