మధువనిలో వీచే

మధువనిలో వీచే మధురాల సుగంధమా
తొలికలలొ చేరే జవరాలా ఆనందమా
నీ అడుగులలో ముత్యాలే పేర్చనా
నీ చూపులలో కవితలనే చదవనా
నీ నవ్వే విరబూసే విరజాజి కాదా
నీతోనే నేనుంటే వరమంతా నాదా

కలిసే కలవో కదిలే కథవో
మనసే కోరే తీయని మలుపో
పిలుపో గెలుపో ఎనలేని మయిమరుపో
నిజమై చేరే కలవైన తొలివలపో
నీలాకాశం లో నీలమంత నీకోసం అందించనా
ఎగసే కెరటంలో జిలుగునంత నీతోనే చవిచూడనా

నడిచే నదివో మురిసే ఝరివో
వయసే ఎరుగని వెన్నెల వలవో
మెరిసే మెరిసే వర్ణాల తొలివెలుగో
కురిసే కురిసే కుసుమాల తొలకరివో
హృదాయవేశం లో వేగమంత ప్రేమగా చూపించనా
ఇకపై లొకంలో అమరం మన ప్రేమని చాటి చెప్పనా