మది కొరే ఆ జడి వాన

మది కొరే ఆ జడి వాన నీవేనా
నీ తొడుగ కొనసాగేనా కలనైన

నిన్నటి తీయని కల నీవేనా
రేపటి కమ్మని ఆశవేనా
యెప్పటికప్పుడు ఊహలేనా
గుండెల్లో నీ బాసలేనా

మది కొరే ఆ జడి వాన నీవేనా
నీ తొడుగ కొనసాగేనా కలనైన

అలలెగసే సంద్రం తీరుగ
కలలెగసెను నీ ఊసులతొ
అరవిరిసిన పుష్పం తీరుగ
మది మురిసెను నీ చూపుతొ

మది కొరే ఆ జడి వాన నీవేనా
నీ తొడుగ కొనసాగేనా కలనైన

తారల తలుకులు వేదుక వెలుగులు
నే చూసానే నీ రాకతొ
వెన్నెల వేలల వేగం పరుగులు
నే తీసానే నీ ఊహలో