పువ్వై నీ నవ్వే దోచెనే

పువ్వై నీ నవ్వే దోచెనే
మువ్వై నీ పలుకు మ్రొగెనే
మాట్లాడే పువ్వా నువ్వే నా ప్రాణమే
మురిపించే మువ్వా నీ నవ్వే నా లోకమే
చెప్పలేని ఊశే గుండె దాటి నేడే నిన్ను చేరేనే

సుగంధమై నువ్వే దరికి చేరినావే
వెన్నెల వేళ వెలుగు నింపినావే
ప్రేమంటే తెలియని నాకు ప్రేమని మథ్థులో ముంచావే
యెవరంటూ అడిగే మనసుకి వరమేదో చూపినావే

వసంతమే మన కోసం విరిసే నేడే
అమాంతము ఆనందం మురిసే చూడే
హద్దంటూ యెరుగని వయసుకి వేడుకలా పర్వము మొదలే
పొద్దంటూ కొరని మనసుకి వేణువులా రాగము సాగెనే

పువ్వై నీ నవ్వే దోచెనే
మువ్వై నీ పలుకు మ్రొగెనే
మాట్లాడే పువ్వా నువ్వే నా ప్రాణమే
మురిపించే మువ్వా నీ నవ్వే నా లోకమే
చెప్పలేని ఊశే గుండె దాటి నేడే నిన్ను చేరేనే