నీ ప్రతి కదలిక

నీ ప్రతి కదలిక
నా వైపైతే
ఎంతో బాగుంటుందీ
నీ ప్రతి కల ఇక
నా కథ అయితే
ఇంకా బాగుంటుందీ
దారులు కలిసే తీరులో
ఆసలు ఎగసే హాయిలో
వలపే విరిసే జోరులో
మనసులు ముడి పడి
అడుగులు తడబడి
పేరులు జతపడి
మనమైపోతే ఇంకా ఇంకా బాగుంటుందీ

నింగిన సాగే మెఘాన్నడిగా
జల జల పారే నదినే అడిగా
చల్లగ వీచే గాలిని అడిగా
తూరుపు విరిసిన వేకువనడిగా
మన కథ మలుపే ఎప్పుడనీ
గెలిచే వలపే ఎక్కడనీ
చినుకుల జడిలో
మెరుపుల అలలో
మల్లెల కలలో
హరివిల్లుల జతలో
కలలే ఇకపై నిజమని
నువ్వు నేను మనమని
దిక్కులు చాటుతు పాడని
ఆనందాలన్నీ

నీ ప్రతి కదలిక
నా వైపైతే
ఎంతో బాగుంటుందీ
నీ ప్రతి కల ఇక
నా కథ అయితే
ఇంకా బాగుంటుందీ
దారులు కలిసే తీరులో
ఆసలు ఎగసే హాయిలో
వలపే విరిసే జోరులో
మనసులు ముడి పడి
అడుగులు తడబడి
పేరులు జతపడి
మనమైపోతే ఇంకా ఇంకా బాగుంటుందీ