చెలి కన్నుల కల నేనేనా

చెలి కన్నుల కల నేనేనా
తన నవ్వుల కధ నాదేనా
సిరిమువ్వల చిరు సవ్వడిలో
రాగాలే వినిపించేనా

తెలిపీ తెలుపక మౌనం వీదక
ఆటలు ఆదే నెచ్చెలి
విరిసీ విరియక ప్రణయం మొదలిక
మాయలు చాలే ప్రేయసి

కురిసీ కురవక మెఘం కదలక
దారే ఎరుగక నిలిచితీ
తొడూ నీడగ నాతొ ఉండక
పంతం యెందుకే ప్రేయసి

అందీ అందక అందం అందేనా
వెంటనే వీడి పొయేనా
అంటీ అంటక బందం వేసెనా
కలతే నింపీ పొయేనా

చెలి నీ కన్నుల కల నేనేనా
చిరునవ్వుల కధ మనదేనా
సిరిమువ్వల చిరు సవ్వడిలో
రాగాలే వినిపించేనా