చూపులకైన తెలిసేనా

చూపులకైన తెలిసేనా
ఈ వింత అనుభవమేమిటో
ఊహలకైన అందేనా
కవ్వింత పరవశమేమిటో
చెప్పాలని యెంతో ఉన్నది
చూపించగలిగితే నా మనసుని
ఓ అందమైన చిత్రంలా చూపించనా
దాచాలని యెంతో ఉన్నది
దాచుకోలేనంత నా ప్రేమని
ఓ తీయనైన రాగంలా వినిపించనా

అరుదైన రీతిలో అంతులేని ఆశతో
నను చేరుకుంది ఈ గాలిలో సుగంధమే నీలా ఇలా
యెనలేని తీరుగా చెప్పలేని మాటతో
మనసల్లుకుంది ఈ వేళలో వసంతమే ప్రేమలా ఇలా
తెలియని పరిచయమా
పొంగిన పరవశమా
తొలి ప్రేమ నిర్వచనమా
తుది లేని నా సంబరమా
జడి వానలో ప్రతి చినుకులో
నిన్నే నే చూడనా
కను రెప్పలో ప్రతి క్షణములో
నిన్నే నే దాచనా

చూపులకైన తెలిసేనా
ఈ వింత అనుభవమేమిటో
ఊహలకైన అందేనా
కవ్వింత పరవశమేమిటో
చెప్పాలని యెంతో ఉన్నది
చూపించగలిగితే నా మనసుని
ఓ అందమైన చిత్రంలా చూపించనా
దాచాలని యెంతో ఉన్నది
దాచుకోలేనంత నా ప్రేమని
ఓ తీయనైన రాగంలా వినిపించనా