చిలకై..సిత కొక చిలకై

చిలకై..సిత కొక చిలకై
కొండ కొనలు దాటి నింగికి ఎగసిపోనా
పలూకై…తీయని పలుకై
గుండె లోథుల్లో నేనే దాగిపోనా
ఎంత దూరమైన నిన్నె చేరుకోనా
చినుకు పాటలాగ మనసు తెలుపుకోనా

జతగా…జతిగా…తలపుల మీటిన కమ్మని కలగా
వలపై వరదై పొంగిపోనా
వరముల వర్షమై చేరుకోనా
కన్నులు దాటిన చూపులు నీవే ఎన్నో కథలని తెలిపెనే
వెన్నెల వేలల విరిసిన ఆశలు ఏవో కవితలు వ్రాసెనే

మెరుపై…పిలుపై…వలపుల గెలుపై వన్నెల చిలకై
తలపై తపనై ఎగసిపడనా
తరగని అలలతో హత్తుకోనా
నిన్నటి ఆశల రూపము నీవే నిండ మనసుల కలిసెనే
రేపటి వెలుగుల వేడుక నీవే తీయని బంధం ముడి వేసెనే

చిలకై..సిత కొక చిలకై
కొండ కొనలు దాటి నింగికి ఎగసిపోనా
పలూకై…తీయని పలుకై
గుండె లోథుల్లో నేనే దాగిపోనా
ఎంత దూరమైన నిన్నె చేరుకోనా
చినుకు పాటలాగ మనసు తెలుపుకోనా