కోరుకున్నది చెలిమయితే

కోరుకున్నది చెలిమయితే
చేరుకున్నది శోకమా
వేడుకున్నది తొడయితే
సొంతమయినది విరహమా

నీడలా నీ తొడుగా ఉండాలనే
నా ఆశాలే ఇక తీరవా
హాయిగా నీ చూపులొ కొలువుండాలనే
ఆ కొరికే ఇక భారమా

కోరుకున్నది చెలిమయితే
చేరుకున్నది శోకమా
వేడుకున్నది తొడయితే
సొంతమయినది విరహమా

మారని తలరాతలే పెనుబాదనీ
ఒహ్ మొడుగా నే మిగలనా
వీడనీ సంక్షొభమే ఈ బథుకనీ
నా మౌనమే పలికేనిలా