కారు మబ్బు కమ్ముకుంది

కారు మబ్బు కమ్ముకుంది
చీకటంత చేరువయింది
ఆశలన్ని వీడమంది
వెన్నెలేది కాననంది
ఎందుకో మరీ

రెక్క విరిగి పడ్డట్టి
సీతా కోక చిలకల్లే
గొంతు మూగబొయినట్టి
కొమ్మ మీది కొయిలల్లే
విసిగి పోయి వేచింది
మధి ఎందుకో మరీ

కన్నీరే నేడే జడివాణై వ్రాలే
చిగురాశే నేడే చితి మంటైపోయే
తిరిగి రాని తోడు కై విరహాలే
కలిసి రాని కొరికలా పయణాలే

వెన్నెలలా వెలుగే కరువయ్యి పొయే
కనరానై బాధే మనసంతా నిండే
మరువలేని మధురాలా ఆ స్మృతులే
వ్రాసేనే వేదనలా కావ్యాలే

కారు మబ్బు కమ్ముకుంది
చీకటంత చేరువయింది
ఆశలన్ని వీడమంది
వెన్నెలేది కాననంది
ఎందుకో మరీ

రెక్క విరిగి పడ్డట్టి
సీతా కోక చిలకల్లే
గొంతు మూగబొయినట్టి
కొమ్మ మీది కొయిలల్లే
విసిగి పోయి వేచింది
మధి ఎందుకో మరీ