కడలి అలలా చిలిపి కలలా

కడలి అలలా చిలిపి కలలా
దరికి చేరే వలపు వలవా
కనులనడిగా కలలొ వెతికా
మలుపు తిరిగే పలుకులనవా
నేడే మనసే జత కోరిందనీ
నీతో బ్రతుకే కొన్సాగాలనీ
ఇకపై వయసే చెలరేగిందనీ
వలపే వరమై విరబూసిందనీ

వాగుల్లో వంకల్లో కదిలేటి నదిలాగా
మాటల్లో నవ్వుల్లో విరిసేటి సుమమేగా
నీ పేరు నా పేరు జత చేర్చే ఈ కథనం
నీలోని నాలోని మొదలయిన ప్రియ సమరం
నిజమేదొ కల ఏదో తెలియనిదీ ఈ సమయం
చూస్తూనే ఉండాలి అనిపించే అదృష్టం

చుక్కల్లో దిక్కులో నిన్నెలే చూస్తున్నా
నా గుండె లోతుల్లో నిన్నేగా దాచున్నా
నువ్వు వేరు నే వరు అనుకుంటే తప్పేగా
కలలెన్నొ కలిపేటి అధ్బుతమీ వలపేగా
ఔనన్న కాదన్నా చరితలిక మారేగా
ఎవరేమి అనుకున్నా ఇక విజయం మనదేగా