ఒడ్డే ఎరగని

ఒడ్డే ఎరగని నావై ఉన్నా ఇన్నాల్లుగా
కమ్మని కలల తీరమై చేరవు నేడే ఇలా
పైవాడికి నా పై కరుణే ఏమొ
మనసే నమ్మని ఇంతటి వెన్నెల
ఒక్క సారిగా నా పై కురిపించాడిలా
తలరాతని మార్చాడో ఏమో
ఎదురీతిక చాలనుకున్నాడో ఏమో
నా జతగా నిన్నే చేర్చాడిలా

వొంటరి గానే ఉంటాననుకున్నా
తుంటరి ఆశలు తగదనుకున్నా
కాలం దారి నా దారి ఎప్పుడూ వేరనుకున్నా
అందరిలాగ అదృష్టం లేదనుకున్నా
ఈనాడేమో
నీ తీరుగ
అందరిని నే దాటేసానే
వెన్నెలలొనే విహరించానే
కమ్మని కలలా జీవిస్తున్నానే
ఆనందాలలో దోలలాడుతున్నానే

ఒడ్డే ఎరగని నావై ఉన్నా ఇన్నాల్లుగా
కమ్మని కలల తీరమై చేరవు నేడే ఇలా
పైవాడికి నా పై కరుణే ఏమొ
మనసే నమ్మని ఇంతటి వెన్నెల
ఒక్క సారిగా నా పై కురిపించాడిలా
తలరాతని మార్చాడో ఏమో
ఎదురీతిక చాలనుకున్నాడో ఏమో
నా జతగా నిన్నే చేర్చాడిలా