ఎవరో నీకై

ఎవరో నీకై మధి నిండ ఆశలు దాచే
ఎప్పుడు నీ తలపే తనలో వెలుగేదో నింపే
ఒక మాట వరమల్లే మీటే
చిరు నవ్వే చిరు జల్లై తడిపే
కలతంతా మరిచేలా చేసే
వాసంతం వాకిట్లొ చేర్చే

ఇంతింతగానే ఊసే మొదలై
అంతంతగా కదిలే మలుపై
నిన్నింతలా లేని హాయై
ఈనాటికే చేసే మాయై
నింగి తారలన్ని నేలకొదిగినట్టుగా
గుండె గూటిలోని ఆశ తీరెనే ఇలా

ఉన్నపాటుగా ఉరికె వయసే
నమ్మనట్టుగా చేసే రభసే
హద్దులన్ని వీడి ఎగిరే గువ్వే
పొద్దులన్ని కొత్త రంగే చూపే
వెండి వానలోనే వయసు విరిసినట్టుగా
కొంటె స్వప్నమే నిజమై చేరేనే ఇలా