ఈనాడే

ఈనాడే తెలిసిందే
మనలోనే మొదలయ్యిందే
తొలిప్రేమ వరమయ్యిందే
ఈనాడే

నీతోడే కొరిందే
నీ చెలిమే అడిగిందే
మనసంతా మురిసిందే
ఈనాడే

కలకాదే ఇది నిజమేలే
అంటూ వింతేగా
కలనైనా ఈ వాసంతం
చేర లేదుగా
కలవరమో పరవశమో ఏమో
మధి దోచే మధురాల సీమో

ఇదిగో చెంతనే చేరానే
కల్లల్లోనే చూసానే
వివారాలన్ని తెలిసేలే
ప్రణయాలే కొన్సాగాలే

మౌనం సరికాదే
చెలిమైనా నేడే
వరసే కుదిరాక
మొహమాటం తగదే

ఆకాశం ఇలదించైనా
మేఘాల హరివిల్లే
నీకోసం దరిచేర్చైనా
నేడే
ఆననదం ఇకవిరిసేల
సంగీతం కొనసగాలా
మనమొకటై వేడుకలగా
నేడే