ఆహ్లాదమే ఆశ్చర్యమే

ఆహ్లాదమే ఆశ్చర్యమే
ఆహ్లాదమీ ఆశ్చర్యమే
వసంతమే నీ లాగ నను చేరేనా
పదింతలై పొంగిపొయెనా ఆనందమే
మురిసిన మనసే నమ్మని వేళ
రేగిన వైణం సరికొత్త సంగీతం

నిను తప్ప నే కోర లేదే వేరేమి ఏనాడూ
నువు తప్ప నాకు నచ్చలేదే వేరేవరూ ఏనాడూ
సుగంధ పరిమలాల వసంత మాలికవో
విహంగ వీక్షణల అమాంత వేడుకవో
మేఘమండలాన దాగి ఉన్న చల్లని చినుకువో
హృదయమందిరాన కొలువై ఉన్న కమ్మని దీపానివో
సిరి సిరి మువ్వల సవ్వడిఒవో
చిరు చిరు జల్లుల వేకువవో
పరవశ దారులని చూపే మమతల కిరణానివో
ఇదివరకెరుగని హయ్యిని నింపిన వలుపుల వయ్యారనివో

ఆహ్లాదమే ఆశ్చర్యమే
ఆహ్లాదమీ ఆశ్చర్యమే
వసంతమే నీ లాగ నను చేరేనా
పదింతలై పొంగిపొయెనా ఆనందమే
మురిసిన మనసే నమ్మని వేళ
రేగిన వైణం సరికొత్త సంగీతం