కావాలంటే

కావాలంటే చెంతకు రానా
నువ్వొద్దంటే వెల్లి పోనా
పువ్వై నువ్వే నవ్వే వేళ
మధి నమ్మని ఆనంధం
ఒక్కసారిగ నాకే సొంథం
చినుకే నాపై కురిసే వేళ
నిన్నె కొరెను అనుబంధం
వలపుల తొలి వాసంతం

నిన్నా మొన్నా కొరుకున్నది
నిన్నే నిన్నే
నేడు రేపు నమ్ముకున్నది
నిన్నే నిన్నే
ప్రేమించినా ద్వేషించినా
నువ్వౌనన్నా కాదన్నా
మధి కొరేధి
నిన్నే నిన్నే

కావాలంటే చెంతకు రానా
నువ్వొద్దంటే వెల్లి పోనా
పువ్వై నువ్వే నవ్వే వేళ
మధి నమ్మని ఆనంధం
ఒక్కసారిగ నాకే సొంథం
చినుకే నాపై కురిసే వేళ
నిన్నె కొరెను అనుబంధం
వలపుల తొలి వాసంతం

యెంతెంతో జరిగిందే

యెంతెంతో జరిగిందే
యేదేదో అడిగిందే
నీ కోసం వేచుందే
నీ తలపే కొరిందే
నువు లేక లేనందే
మల్లి మల్లి నీ పిలుపే వింటుందే

చేరువైనా ధూరమైనా
చెంతనున్నా వీడిపొయినా
ఉన్నావనుకుంటుందే
లేవంటే నమ్మదే నా మధి
ఇక రావంటే వినదే యెందుకది

గాలికైనా చెప్పలేనా
వానలాగా చేరలేనా
చెప్పాలనిపించిందే
మధి మాటున దాగిన మాటది
ఇప్పటికైనా రావలసిన మలుపది

యెంతెంతో జరిగిందే
యేదేదో అడిగిందే
నీ కోసం వేచుందే
నీ తలపే కొరిందే
నువు లేక లేనందే
మల్లి మల్లి నీ పిలుపే వింటుందే

తొలిచూపులో

తొలిచూపులో
చిరునవ్వులో
కనుసైఘలో
తడబాటులో
యెమయ్యిందిలా నా గుందెలో
నీకోసమే కదిలిందిలా

నీ వైపుగా సాగిందిలే
నా ఊహలా
నీ నీదగా నదిచిందిలే
నా ఆశలా

కలవరమే ఈ ప్రేమా
పరవశమే ఈ ప్రేమా
మనసంతా మధురంగా
నిండిందే ఈ ప్రేమా
మునుపెప్పుడూ లేనంత
సంతోషం ఈ ప్రేమా
అసలెవరూ కననంత
అధ్బుతమే ఈ ప్రేమా

జడివానలో
చిరుగాలిలో
చిగురాకులో
సిరిమల్లెలో
ఆ మేఘమే ఈనాడిలా
ప్రియ గానమై కురిసిందిలే

నవలోకమే చూపిందిలే
హరివిల్లులా
తొలి చీకటే తరిమిందిలే
సిరివెన్నెలా

కలవరమే ఈ ప్రేమా
పరవశమే ఈ ప్రేమా
మనసంతా మధురంగా
నిండిందే ఈ ప్రేమా
మునుపెప్పుడూ లేనంత
సంతోషం ఈ ప్రేమా
అసలెవరూ కననంత
అధ్బుతమే ఈ ప్రేమా

కారు మబ్బు కమ్ముకుంది

కారు మబ్బు కమ్ముకుంది
చీకటంత చేరువయింది
ఆశలన్ని వీడమంది
వెన్నెలేది కాననంది
ఎందుకో మరీ

రెక్క విరిగి పడ్డట్టి
సీతా కోక చిలకల్లే
గొంతు మూగబొయినట్టి
కొమ్మ మీది కొయిలల్లే
విసిగి పోయి వేచింది
మధి ఎందుకో మరీ

కన్నీరే నేడే జడివాణై వ్రాలే
చిగురాశే నేడే చితి మంటైపోయే
తిరిగి రాని తోడు కై విరహాలే
కలిసి రాని కొరికలా పయణాలే

వెన్నెలలా వెలుగే కరువయ్యి పొయే
కనరానై బాధే మనసంతా నిండే
మరువలేని మధురాలా ఆ స్మృతులే
వ్రాసేనే వేదనలా కావ్యాలే

కారు మబ్బు కమ్ముకుంది
చీకటంత చేరువయింది
ఆశలన్ని వీడమంది
వెన్నెలేది కాననంది
ఎందుకో మరీ

రెక్క విరిగి పడ్డట్టి
సీతా కోక చిలకల్లే
గొంతు మూగబొయినట్టి
కొమ్మ మీది కొయిలల్లే
విసిగి పోయి వేచింది
మధి ఎందుకో మరీ

ఈ స్నేహమే

ఈ స్నేహమే జీవితాన్ని మల్లి చూపించెనే
నీ స్నేహమే జీవితాన్ని నాకై మార్చెనే
ప్రేమో యెమో అనిపించేలా…ఎన్నొ కలలని చూపించెనే

నిను కలిసిన తరువాత నమ్మ లేకున్నా
ముందున్నది నేనేనా అని
నివి చేరిన తరువాత మారి పోతున్నా
లేదన్నది బాదేనా అని
నవరాగలెన్నొ పలించింధి నీ స్నేహమే
తొలివేడుకలేవొ జరిపించింధి ఈ మేఘమే

ఈ స్నేహమే జీవితాన్ని మల్లి చూపించెనే
నీ స్నేహమే జీవితాన్ని నాకై మార్చెనే
ప్రేమో యెమో అనిపించేలా…ఎన్నొ కలలని చూపించెనే

పెదవే దాటదు

పెదవే దాటదు ఓ మాటే
మధిలో ఆగదు ఓ ఆశే
పరుగులు తీసెను నా వయసే
నిన్ను చూసకా నీ దరి చేరాకా
ఆపేదెలా మనసుని
మరిచేదెల కలలని
చేరేదెల కౌగిలిని
కలిపేదెల మన కథలని

వాకిట విరిసిన పువ్వై రావా
వేకువ వేలల వెలుగై రావా
వెన్నెలలో తొలి కలలే నీవా
నమ్మని హాయిని చర్చే వరమా
తీయని కవితని పలికే స్వరమా
వలపై వరదై నను ముంచేయ్యవా
మనసే మరిచేలా బ్రతుకుని మార్చేయవా

పెదవే దాటదు ఓ మాటే
మధిలో ఆగదు ఓ ఆశే
పరుగులు తీసెను నా వయసే
నిన్ను చూసకా నీ దరి చేరాకా
ఆపేదెలా మనసుని
మరిచేదెల కలలని
చేరేదెల కౌగిలిని
కలిపేదెల మన కథలని

తొలి చూపుకి తెలిసేనా

తొలి చూపుకి తెలిసేనా
విరహాల విధి రాత
కలలన్నవి యెగసేనా
కలతే కథ అయ్యాకా
మేఘం మెరుపుల రాగం వలపుల బాసలు రేపేనా
వేగం పెరిగీన్ సోకం తీయని ఆశలు చూపేనా
ఏదో మలుపే చేరేనంటూ
ఇప్పటికైనా మారేనంటూ
అంతే ఎరుగని ఆశల కడలి
కన్నీరే మిగిల్చేనా

నీతో గడిపిన ప్రతి క్షణము
మనసే మరువని గ్న్యాపకము
నీవే పలికిన ప్రతి పలుకు
వరమని మురిసిన మధినడుగు
ఆకాశం నా ప్రేమా
నీకోసం ఏ పూటైనా
చినుకల్లే ఒదిగేనా
నువ్వు లేకా ఆ వానా
వేసవి ఆవిరేనా

తొలి చూపుకి తెలిసేనా
విరహాల విధి రాత
కలలన్నవి యెగసేనా
కలతే కథ అయ్యాకా
మేఘం మెరుపుల రాగం వలపుల బాసలు రేపేనా
వేగం పెరిగీన్ సోకం తీయని ఆశలు చూపేనా
ఏదో మలుపే చేరేనంటూ
ఇప్పటికైనా మారేనంటూ
అంతే ఎరుగని ఆశల కడలి
కన్నీరే మిగిల్చేనా

రెండు కన్నులా

రెండు కన్నులా వెండి వెన్నెలా చూపుతున్నదీ నీ కలలే
నిండు గుండెలో కొంటె పాటలా చేరుకున్నదీ నీ పిలుపే
తొలి ప్రేమ దారిలో వింత యాణమా
మనసైన వేళలో వలపు గానమా
తెలియని కలలా అలలలో తడిసీ
విరియని ఆశల కడలిలో కదిలీ

కంటి చూపుతో నిన్న లేని సరికొత్త లోకాన్ని చూపించావే
చిన్ని నవ్వుతో వెన్నెలైన తొలి వేడుకేదో దరి చేర్చావే
మధురాల సీమలన్ని ఇక మనవేగా
మధికొరుకున్న తొలి పర్వముగా
కలనైన చూడనీ ఆనందంగా
మలుపేదో నడిపిన వేదంగా

రెండు కన్నులా వెండి వెన్నెలా చూపుతున్నదీ నీ కలలే
నిండు గుండెలో కొంటె పాటలా చేరుకున్నదీ నీ పిలుపే
తొలి ప్రేమ దారిలో వింత యాణమా
మనసైన వేళలో వలపు గానమా
తెలియని కలలా అలలలో తడిసీ
విరియని ఆశల కడలిలో కదిలీ

కథ కదిలే

కథ కదిలే
తెలిసేనా నేస్తం
కథ కదిలే
తెలిసేన నేస్తం
తలరాతే మార్చిందే ప్రేమ
తొలి కలలే చూపిందే ప్రేమ
పలుకులలొ చేరిందే ప్రేమ
అడుగులలో కలిసిందే ప్రేమ

వరమో ఇది విషమో ఇది
అడుగేయగా తెలిసేనని
కలయో ఇది కలతో ఇది
కలిస్తే కదా తెలిసేనిది
వశమో ఇది విరహమో ఇది
ప్రేమిస్తే కదా తెలిసేనిది
ఉరికే ఆశల వేగం తరిగే వేళకి
కోరికలన్ని రెక్కలు కట్టుకి పొయే వేళకి
కలిసుండాలని కొరేనో
కొత్తాశలకై కదిలేనో
యెప్పటికి నీజతగా నిలిచేనో

కథ కదిలే
తెలిసేనా నేస్తం
కథ కదిలే
తెలిసేన నేస్తం
తలరాతే మార్చిందే ప్రేమ
తొలి కలలే చూపిందే ప్రేమ
పలుకులలొ చేరిందే ప్రేమ
అడుగులలో కలిసిందే ప్రేమ

ఈ క్షణమున నాలోనా

ఈ క్షణమున నాలోనా
యెప్పుడెరుగని పులకింతా
నువ్వు చేరిన వైణానా
వలపన్న కవ్వింతా
మౌనానా రేగిన ఆశలు
ఆకశానే అందెనే
చూపులు చూపులు కలిసే వేలే
తీయని మథ్థే మనసులు చేరే
ఇధివరకెరుగని ప్రణయం పొంగే

యే కలల రూపమో
ఈ వలపుల బంధము
యే తలపు మైఖమో
ఈ తీయని పయనము
కడలి లో అలలని
మధిలొ కలలని
ఒక్క సారి గా నింగికి చేర్చే
అద్భుతమైన అనుభవము

యే తపన ఫలితమో
ఈ వేళ నేస్తము
యే చిలిపి రాగమో
సరికొత్త సంగీతము
తారల జిలుగుని
వేకువ వెలుగుని
ఒక్క సారి గా కంటికి చూపే
వేడుకైనదీ జీవితము

ఈ క్షణమున నాలోనా
యెప్పుడెరుగని పులకింతా
నువ్వు చేరిన వైణానా
వలపన్న కవ్వింతా
మౌనానా రేగిన ఆశలు
ఆకశానే అందెనే
చూపులు చూపులు కలిసే వేలే
తీయని మథ్థే మనసులు చేరే
ఇధివరకెరుగని ప్రణయం పొంగే